ఐదేళ్లలో చంద్రబాబు హయాంలో రైతులు అల్లాడిపోయారు : మంత్రి కారుమూరి

-

చంద్రబాబు వ్యవసాయం దండుగ అన్నారని, అలాంటి వ్యక్తి కోసం వార్తలు రాస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. తాజాగా ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లలో ఆయన హయాంలో రైతులు అల్లాడిపోయారన్నారు. మా‌ హయాంలో రైతులకు అన్ని రకాలుగా మేలు జరుగుతుందని, దళారులకు డబ్బు పోకుండా‌అది కూడా రైతులకే అందేలా చర్యలు చేపట్టామన్నారు మంత్రి కారుమూరి. గన్నీ బ్యాగ్స్ కూడా‌ మేమే ఇస్తున్నామని, జగన్ చేసిన మేళ్లు చంద్రబాబుకు కనపడవని మంత్రి కారుమూరి మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘రైతుల గుండెల్లో జగన్ ఉన్నారు. చంద్రబాబు సీఎం అయితే కరువు కాటకాలే. జగన్ సీఎం ఐతే నదులు పుష్కలంగా ప్రవహిస్తాయి. పంటలు బాగా పండుతాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలోనే ఎమ్మెస్పీ ధర అధికంగా ఉంది. వాస్తవాలు తెలుసుకుని రామోజీరావు వార్తలు రాయాలి. ఇరవై రోజుల్లో ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు ఇస్తున్నాం. బీసీలకు కోటి 76 లక్షల కోట్లు ఖర్చు చేశాం. నలుగురిని రాజ్యసభకి జగన్ పంపారు. చంద్రబాబు ఒక్కరి నైనా ఎందుకు పంపలేదు?. బీసీల ప్రేమ ఎవరికి ఉందో అర్థం కావటం లేదా?. కుప్పంలోనే చంద్రబాబుకు సీన్ లేదని తేలిపోయింది. బీసీలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు.

లోకేష్ ఏం చేశాడని పాదయాత్ర చేస్తాడు?. ప్రజలంతా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్తున్నారు. మరి లోకేష్ తన తండ్రి హయాంలో ఏం చేశారని చెప్తారు?. ఒక్క పథకమైనా చెప్పుకునేది ఉందా?. అన్ని కులాలూ జగన్ ని కావాలని అంటున్నాయి. బీసీలకు ఏం చేశారో టీడీపీ శ్వేతత్రం విడుదల చేయాలి. మేము ఏం చేశామో శ్వేతపత్రం విడుదల చేస్తాం. రైతుల నుండి తడిసిన ప్రతి గింజా కొనుగోలు చేస్తాం. చంద్రబాబు సీఎస్ కు లేఖ రాయటానికి సిగ్గు ఉండాలి. నిజం చెబితే తల వక్కలు అవుతుందని చంద్రబాబుకు శాపం ఉంది. అందుకే ఆయన అబద్దాలతో లేఖ రాశారు.’ అని మంత్రి కారుమూరి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version