టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. చంద్రబాబుకు రైతు పోరుబాట చేసే అర్హత లేదన్నారు. ఆయన పాలనలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. గతంలో వ్యవసాయం దండుగ అని ఆయన అన్నారని దుయ్య బట్టారు.
రాష్ట్రంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ, నష్టపోయిన రైతులకు పరిహారం అందచేస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు తన ఉనికి కాపాడుకోవడం కోసం మాత్రమే రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు.
రైతుల నుంచి ఎలాంటి రుసుము లేకుండా మిల్లర్లు ధాన్యం తీసుకోవాని.. లేదంటే చర్యలు తీసుకుంటామమని ఏపీ మంత్రులు హెచ్చరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం ఎలా ఉన్నా సరే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ 10రోజుల్లోనే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి రూ.530 కోట్లు వారి అకౌంట్లో జమ చేశామని తెలిపారు. ఈ ప్రభుత్వం రైతులకు అండగా ఉండే ప్రభుత్వమని వెల్లడించారు.