బతుకమ్మ పండుగనే రాష్ట్ర పండుగగా గుర్తించిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిది అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తింపు తీసుకురావాలని జాగృతి ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసామని అన్నారు రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిందని చెప్పారు బుధవారం వికారాబాద్ లో నిర్వహించిన బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బీసీ హక్కుల కోసం పోరాడడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు బీసీ ఎస్సీ ఎస్టీలకు కుల వివక్ష నుండి విముక్తి కల్పించాలని బీసీ రిజర్వేషన్లను కూడా పెంచాలని కవిత డిమాండ్ చేశారు ఐఏఎస్ ఐపీఎస్ తరహాలో జరిగే పరీక్షల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. వెనుకబడిన తరగతులు వారికి అన్యాయం జరుగుతుందని వారి హక్కుల కోసం పోరాడాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.