తెలంగాణ సిరి సంపదలతో వెలుగొందాలి – కల్వకుంట్ల కవిత

-

తెలంగాణ సిరి సంపదలతో వెలుగొందాలని ట్వీట్‌ చేశారు కల్వకుంట్ల కవిత. ఇవాళ ఉగాది పర్విదినం కావున కల్వకుంట్ల కవిత… తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. తెలుగింటి నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా.. ప్రజలంతా ప్రగతిపథంలో ముందుకు సాగాలని, ప్రతి ఇంటా ఆరోగ్యం-ఆనందంతోపాటు సిరిసంపదలు వెల్లివిరియాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..ప్రజలందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు కవిత. కాగా.. నిన్న ఈడీ విచారణను ఎదుర్కొన్న కల్వకుంట్ల కవిత.. ఇవాళ హైదరాబాద్‌ కు వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక ఫ్లైట్‌ లో బేగంపేట ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version