కెసిఆర్ – అమిత్ షా కాంగ్రెస్ పార్టీని వ్యూహత్మకంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు: రేవంత్ రెడ్డి

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో రఘునందన్ రావు మామ ఇంట్లో దొరికిన డబ్బులు, లేదా రఘునందన్ రావు పైన పెట్టిన కేసులు ఏమయ్యాయి అని ప్రశ్నించారు.

అలాగే హుజురాబాద్ ఎన్నికల సమయంలో ఈటెల రాజేందర్ ని జైలుకు పంపిస్తామన్న టిఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా ఓటు బ్యాంకు తగ్గలేదని అన్నారు. అలా హుజురాబాద్ లో సానుభూతితో ఈటెల రాజేందర్ గెలిచిన తర్వాత ఈటల రాజేందర్ పైన వేసిన కేసులు ఏమయ్యాయి అని ప్రశ్నించారు.

ఇలా రాష్ట్రంలో కెసిఆర్ బృందం, ఢిల్లీలోని అమిత్ షా బృందం కలిసి కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి శత్రువుగా భావించి ఎన్నికల సమయాలలో ఒక భాగోద్వేగం గల అంశాలను తెరపైకి తీసుకువచ్చి తద్వారా ఎన్నికలలో ప్రయోజనం పొందుతున్నాయని అన్నారు. ఒకరు గెలిస్తే మరొకరు ప్రధాన ప్రతిపక్షంగా ఉంటున్నారని.. కాంగ్రెస్ పార్టీని మాత్రం వ్యూహత్మకంగాా అణిచివేస్తున్నాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version