మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రెండు మూడు పెగ్గులు వేసి కేసీఆర్ వరంగల్ సభకు వచ్చినట్టు ఉన్నాడు. పదేళ్లు అధికారంలో ఉండి ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారు.
ఉద్యమకారుడి బిడ్డ అని చెప్పుకునే కవిత లిక్కర్ స్కామ్ చేసి తెలంగాణ పరువు తీసింది. 8 నెలల ముందే మద్యం షాపులకు టెండర్లను పిలిచిన గొప్ప నాయకుడు కేసీఆర్.మహిళలకు ఉచిత బస్సు పథకంపై మాట్లాడడానికి సిగ్గు ఉండాలి.పేద, మధ్యతరగతి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎంతో ఉపయోగపడుతుంది’ అని షాద్ నగర్ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేసిందని కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.