కనబడట్లేదు గాని..బీజేపీ-కాంగ్రెస్ దూకుడుతో కేసీఆర్ కాస్త ఎక్కువగానే టెన్షన్ పడుతున్నారని అనుకోవచ్చు. ఏదో పైకి ఏదో చేసేస్తామని హడావిడి చేస్తున్నారు గాని..మళ్ళీ అధికారం దక్కించుకోవడం చాలా కష్టమనే విషయం కేసీఆర్ కు కూడా అర్ధమవుతుందనే అనుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్తితులని చూసుకుంటే…రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి అంత అనుకూలమైన వాతావరణం ఏమి లేదని చెప్పొచ్చు. రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు బీజేపీ, మరో వైపు కాంగ్రెస్ పార్టీల దూకుడుతో టీఆర్ఎస్ నేతల్లో కనిపించని భయం మొదలైందని చెప్పొచ్చు.
ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతుంది..టీఆర్ఎస్ పార్టీకి నెగిటివ్ పెరుగుతుంటే..బీజేపీ-కాంగ్రెస్ పార్టీలకు కాస్త పాజిటివ్ పెరుగుతుంది. టీఆర్ఎస్ పాలనలో ఉన్న లోపాలని టార్గెట్ చేసుకుని కాంగ్రెస్, బీజేపీలు ముందుకెళుతున్నాయి. అయితే టీఆర్ఎస్ పార్టీకి రాజకీయ అస్త్రంగా బీజేపీ దొరికిందనే చెప్పాలి. అది కూడా కేంద్ర ప్రభుత్వ రూపంలో..కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని కేసీఆర్ రాజకీయం నడుపుతున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుని బూచిగా చూపించి కేసీఆర్ రాజకీయ లబ్ది పొందారు. ఇప్పుడు కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారు.