తెలంగాణలో రైతుల దశను మార్చిన వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని తెరాస అధినేత కేసీఆర్ కోరారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బుధవారం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని నిర్మాణ పూర్తయితే నిజాంసాగర్ సంవత్సరం పొడవునా నీళ్లతో కళకళలాడుతుంటుందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. నీళ్లు పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పుడు రైతు ఆనందానికి కొదవ వుండదన్నారు. రెండో పంటను మార్చి నెలలోనే కోసినప్పుడే బంగారు గాణ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
సింగూర్ నుంచి నీళ్లు ఇవ్వాలని పోచారం పోట్లాడిండని తెలిపారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డిని వ్యవసాయ మంత్రిగా చేసిన తర్వాత రైతాంగం దశ మారిపోయిందని కొనియాడారు. చందూర్, మోస్తరను మండల కేంద్రాలు చేస్తామన్నారు. బాన్సువాడకు డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తామన్నారు హామి ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ముస్లిం, గిరిజనుల జనాభా పెరగడంతో దాని ప్రకారమే రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ అసెంబ్లీ, కేబినెట్‌లో తీర్మానం చేసి ఢిల్లీకి పంపితే దాన్ని ప్రధాని పెండింగ్‌లో ఉంచారని మండిపడ్డారు. దేశం మోదీ తాత జాగిరా ఆయన చెప్పిందే చేయాలనుకుంటే…ఇక్కడ నడవదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.