కరోనా కట్టడిలో తెలంగాణా ప్రభుత్వం చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ప్రజలకు ఇబ్బంది రాకుండా ఉండటానికి చర్యలు చేపడుతుంది. అదే విధంగా లాక్ డౌన్ సమయంలో ప్రజల సేవలను వాడుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇది పక్కన పెడితే లాక్ డౌన్ సమయంలో ఇప్పుడు మహిళల సేవలను వాడుకోవాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఎవరు అయితే ఉద్యోగాలు లేకుండా ఉంటారో…
వాళ్ళు అందరి చేత మాస్క్ లను తయారు చేయించాలి అని భావిస్తున్నారు. మాస్క్ లను తయారు చేసి ప్రజలకు అందించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మహిళలకు ఈ బాధ్యత అప్పగించడానికి కొంత నిధులను కూడా కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఒక మాస్క్ తయారికి రూపాయి ఇవ్వాలని లేదా ఇంకో అర్ధ రూపాయి పెంచి ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ దీనిపై మంత్రులతో కూడా చర్చించారు.
కరోనా నేపధ్యంలో రాష్ట్రంలో మాస్క్ ల కొరత ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మాస్క్ లను తప్పనిసరి చేయడం తో ప్రజలు అందరూ కూడా మెడికల్ షాప్ ల చుట్టూ తిరుగుతున్నారు. వారు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో జిల్లా కేంద్రాల్లో లేదా నియోజకవర్గ కేంద్రాల్లో దీని తయారి చేపడితే ఏ ఇబ్బంది ఉండదు అని ప్రభుత్వం భావిస్తుంది. త్వరలోనే ఈ కార్యక్రమం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.