మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ డుమ్మా … కిషన్ రెడ్డి ఆహ్వానం పంపినా కుదర్లేదా ?

-

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణకు రానున్నారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం ఈయనను ఆహ్వానించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎయిర్ పోర్ట్ కు వెళ్ళాలి. కానీ కారణాలు ఏమి తెలియదు.. రేపు ప్రధానిని ఆహ్వానించడానికి సీఎం కేసీఆర్ వెళ్ళడం లేదన్న మాట మాత్రం BRS వర్గాల్లో వినిపిస్తోంది. ఈయన గైర్హాజరీలో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మోదీని రిసీవ్ చేసుకోవడానికి వెళుతున్నారని తెలుస్తోంది.

వాస్తవానికి మోదీ పర్యటన గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ కు ఆహ్వానం పంపారట. అయినప్పటికీ మోదీ కన్నా ముఖ్యమైన ఇంకేదో పని ఉందేమో హాజరు కావడం లేదు కేసీఆర్ అనుకుంటున్నారు. ఇంతకు ముందు కూడా మోదీ పర్యటనకు వచ్చిన సమయంలో కేసీఆర్ హాజరు అయిన సందర్భం లేదు.. దీనితో మంత్రి తలసాని బేగంపేట ఎయిర్పోర్ట్ లో మోదీకి ఆహ్వానం పలుకుతారు. ఇక ఈ పర్యటనలో భాగంగా తిరుపతిలో వందేభారత్ రైలు తో పాటుగా మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version