అత్యంత కీలక విషయం లో జగన్ ని టోటల్ గా డామినేట్ చేసిన కే‌సి‌ఆర్ !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఏర్పడింది. ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఏ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడుగులు వేస్తున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అన్నట్టు వాతావరణం ఉండేది. అయితే ఎప్పుడైతే జగన్ అధికారంలోకి రావడం జరిగిందో ఇరు రాష్ట్రాలు కర్క చలనం కాదు కరచాలనం చేసుకోవాలని జగన్ ముఖ్యమంత్రి అయిన సమయంలో కెసిఆర్ పేర్కొనటం జరిగింది. ఆ విధంగానే జగన్ మరియు కెసిఆర్ ఇద్దరు సరైన రీతిలో పరిపాలన సాగించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. నీటి విషయంలో మరియు ప్రాజెక్టు విషయలలో అదేవిధంగా ప్రభుత్వ అధికారాలకు సంబంధించిన విషయాలలో సామరస్య వాతావరణంలో సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవహరించారు.

ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉంది అన్న సమయంలో జగన్ ని టోటల్ గా డామినేట్ చేసే విధంగా కెసిఆర్ వ్యవహరించినట్లు వార్తలు వస్తున్నాయి. అదేమిటంటే పారిశ్రామికంగా ఆంధ్రా కంటే తెలంగాణ రాష్ట్రాన్ని టోటల్ గా డామినేట్ చేయటానికి కెసిఆర్ పూనుకున్నట్లు వస్తున్న వార్తల సారాంశం. ముఖ్యంగా ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడి పోవడంతో…తెలంగాణ లో ఐటీ రంగం ఒక హైదరాబాద్ కే పరిమితం కాకుండా ఇతర నగరాలలో కూడా పెట్టాలని కెసిఆర్ సంచలన చర్యలు తీసుకోబోతున్నారు అని టిఆర్ఎస్ పార్టీలో టాక్.

 

మరోపక్క వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగం ద్వారా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా ఐటీ సంస్థలు తేవడానికి కృషిచేస్తున్నారు. ఇటువంటి క్రిటికల్ సమయంలో కేసీఆర్ సర్కార్ ఒక అంతర్జాతీయ ఐటీ రంగ సదస్సులో దేశంలోనే  35 శాతం ఫార్మా ఉత్పత్తులు తెలంగాణ నుంచే ఎగుమతి అయ్యేలా చేస్తామని ప్రకటించడం జీనోమ్ వ్యాలీ విస్తరణకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లుగా ప్రకటించడంతో ఇది ముమ్మాటికీ జగన్ ని టోటల్ గా డామినేట్ చేయడమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version