పెన్సిల్ పై శివలింగం…! వైరల్ ఫొటోస్…!

-

మహాశివరాత్రి సందర్భంగా ఒక కళాకారుడు చేసిన శివలింగం ఇప్పుడు ఆసక్తిగా మారింది. శివరాత్రి సందర్భంగా పెన్సిల్‌ కొనపై శివలింగాన్ని తయారు చేసాడు. తన అద్భుతమైన ప్రతిభతో శివుడిపై తనకు ఉన్న భక్తిని చాటుకున్నాడు. పెన్సిల్‌ కొనపై శివలింగాన్ని చెక్కడంతో పాటు ఓ చిన్న రాయిని శివలింగంగా మలచి దాన్నో సీసాలో అమర్చి అబ్బురపరిచాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే ఓడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్‌కు సమీపంలోని ఖుర్దా జిల్లాకు జట్నికి చెందిన ప్రముఖ కళాకారుడు ఎల్‌.ఈశ్వరరావు మహా శివరాత్రి సందర్భంగా 0.5 అంగుళాల పరిమాణం ఉన్న రాయిని శివలింగంగా రూపొందించి 0.5సెం.మీల పెన్సిల్‌ కొనపైనా శివలింగాన్ని తయారు చేసారు. దాన్ని ఒక సీసా లో అమర్చాడు. వీటిని తయారు చేయడానికి తనకు మూడు రోజుల సమయం పట్టింది అని చెప్పాడు.

నాలుగు చిన్న చిన్న ముక్కలను సీసాలో మర్చడం చాలా కష్టమైందని వివరించాడు. గతంలో అతను పురుషుల హాకీ ప్రపంచకప్ ట్రోఫీని పెన్సిల్, చింతపిక్కలతో తయారు చేసి ఆశ్చర్యానికి గురి చేసాడు. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన మోడీ, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ విజయం సాధించగా వారి ఫోటోలను పెన్సిల్ కొనపై వేరు వేరు గా తయారు చేసాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని కూడా ఇలాగే చేసాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version