సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. రోజు రోజుకి జిల్లాలో కేసులు పెరుగుతున్నాయి గాని ఎక్కడా తగ్గడం లేదు. ప్రతీ రోజు అక్కడ పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. నిన్న ఒక్క రోజే అక్కడ 26 కేసులు నమోదు కావడం తో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు. అక్కడి అధికారుల పని తీరుపై ఆయన అసహనంగా ఉన్నట్టు సమాచారం.
జిల్లా మంత్రులు సమర్ధవంతంగానే పని చేస్తున్నా అధికారులు మాత్రం సరిగా పని చేయడం లేదని భావిస్తున్నారు. దీనితో రాష్ట్ర స్థాయి అధికారుల బృందాన్ని జిల్లాకు పంపాలి అని కేసీఆర్ భావించారు. జిల్లాలో ఇప్పటికే కీలక అధికారులపై బదిలీ వేటు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాబోయే రెండు మూడు రోజుల్లో ఇక్కడ ప్రత్యేక కరోనా ఆస్పత్రిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ప్రత్యెక అధికారులకు జిల్లా బాధ్యతలను అప్పగించాలి అని భావిస్తున్నారు. ఇప్పటికే సమర్ధవంతమైన అధికారుల కోసం సర్కార్ వేట మొదలుపెట్టింది. జిల్లాలో లాక్ డౌన్ ని కూడా కఠినం గా అమలు చెయ్యాలని సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. ప్రజలు ఎవరూ కూడా రోడ్ల మీదకు రాకుండా చూడాలని స్పష్టం చేసింది సర్కార్. ఇక అవసరం అయితే కేసీఆర్ అక్కడ పర్యటన చేసే అవకాశం ఉందని అంటున్నారు.