చంద్రబాబుకి జూనియర్ ఎన్టీఆర్ ఫోన్…?

-

టాలీవుడ్ లో, రాజకీయాల్లో ఎప్పుడు కూడా వార్తల్లో ఉండే అంశం ఏదైనా ఉందీ అంటే… జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి దగ్గర కావడం, తెలుగుదేశం పార్టీకి దగ్గర కావడం. తారక్ ఎప్పుడు టీడీపీకి దగ్గర అవుతారా అని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా సరే అది మాత్రం జరగడం లేదు. టాలీవుడ్ లో తారక్ హవా ఉంది. అతను రాజకీయాల్లోకి రావాలి అనేది నందమూరి కుటుంబం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. గత కొంత కాలంగా దీనిపై అనేక చర్చలు జరుగుతూ వస్తున్నాయి.

అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దీనిపై స్పందించడం లేదు. ఇక తాజాగా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వచ్చింది. దీనికి చంద్రబాబు కి అందరూ శుభాకాంక్షలు చెప్పారు. కాని తారక్ మాత్రం చెప్పలేదు. సిఎం జగన్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు ఇలా ప్రతీ ఒక్కరు చంద్రబాబుకి శుభాకాంక్షలు చెప్పినా తారక్ మాత్రం ఒక్క ట్వీట్ అంటే ఒక్కటి కూడా చేసిన సందర్భం అనేది లేదు. దీనిపై ఇప్పుడు అనేక వార్తలు వస్తున్నాయి. అయితే అతను సోమవారం సాయంత్రం చంద్రబాబుకి ఫోన్ చేసారట.

పార్టీ పరిస్థితి తో పాటుగా పలు విషయాలను అడిగినట్టు సమాచారం. అలాగే పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి భువనేశ్వరి తో కూడా మాట్లాడారని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో గాని సోషల్ మీడియాలో దీనిపై వార్తలు వస్తున్నాయి. తన ఇంట్లో చిన్న కార్యక్రమం ఒకటి ఉందని, లాక్ డౌన్ అయిన తర్వాత ఆ కార్యక్రమం ఉంటుందని అప్పుడు కుటుంబ సభ్యులు హాజరు కావాలని కోరినట్టు సమాచారం. దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version