తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం లో ఎన్నికలు ఎప్పుడు అయిన రావొచ్చు… సిద్ధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ నాయకులకు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చని… దీనిపై రాష్ట్ర బీజేపీ పార్టీ చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
పార్టీని గ్రామ స్థాయిలో చాలా బలంగా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ పార్లమెంట్ భవన్ లో రాష్ట్ర బీజేపీ నేతలతో ఈ వ్యాఖ్యలు అమిత్ షా చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్క సారిగా హాట్ టాపిక్ గా మారాయి. అమిత్ షా సామాన్యంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడు. అయితే.. ఆయనే ఈ వ్యాఖ్యలు చేశాడంటే.. సీఎం కేసీఆర్ ముందుస్తుకు వెళ్లే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే… దీనిపై టీఆర్ ఎస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.