త్వరలో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుండడంతో తెలంగాణ రాష్ట్రంలో రెండు స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. మార్చ్ ఆరో తారీఖున నామినేషన్ ఉండటం అదే రోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కావడంతో తెలంగాణలో రాజ్యసభ ఆశావాహులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఇద్దరి రాజ్యసభ పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలంగాణ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతానికైతే సీఎం కేసీఆర్ దృష్టిలో ముగ్గురు పేర్లు ఉన్నట్లు సమాచారం. కేశవరావు, దామోదరరావు, గ్యాదరి బాలమల్లు… ఈ ముగ్గురిలో ఇద్దరికే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరోసారి తనకు ఛాన్స్ ఇస్తారనే ధీమాతో కేశవరావు మొదట్నుంచీ ఉన్నారు. అయితే ఇప్పటికే ముగ్గురు బీసీ వర్గాలకు చెందిన వారు రాజ్యసభ కు వెళ్లారు మళ్లీ అదే కోట అవకాశం ఉంటుందా అంటే పెద్ద డౌటే అన్నట్టు ఉంది.
కాగా దామోదరరావు ఎప్పుడో రాజ్యసభ సీటు ఇస్తానని కెసిఆర్ హామీ ఇవ్వడం జరిగింది. దామోదరరావు గతంలోనే రాజ్యసభకు వెళ్లాల్సిన సందర్భంలో ఆయన స్థానంలో సంతోష్ రాజ్య సభకు వెళ్లడం జరిగింది. దీంతో ఇప్పుడు కచ్చితంగా దామోదర్ కి అవకాశం కెసిఆర్ ఇస్తారని చాలామంది అంటున్నారు. ఇంకా చాలా మంది పేర్లు వినపడుతున్నాయి వీరిలో కుమార్తె కవిత పేరు కూడా వినబడుతుంది. దీంతో అసెంబ్లీ సమావేశాలు ముందు ఎవరు తెలంగాణ నుండి రాజ్యసభకు వెళ్తారో పర్ ఫెక్ట్ లిస్ట్ తో కెసిఆర్ బయటకు రానున్నట్లు టిఆర్ఎస్ పార్టీ వర్గాల్లో టాక్. దీంతో రాజ్యసభ ఆశావహులు అంతా గుండె పట్టుకుని కూర్చున్నారు.