ఆ ఒక్క పాయింట్ తో దేశం మొత్తం కే‌సి‌ఆర్ కి సెల్యూట్ కొడుతోంది !

-

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించడంతో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రిజల్ట్స్ గురించి మాట్లాడుతూ అనేక విషయాలను ప్రస్తావించారు. ప్రాంతీయ అంశాలు మొదలుకొని జాతీయ అంశాల వరకు అన్ని విషయాలపై స్పష్టంగా తనదైన శైలిలో కెసిఆర్ విశ్లేషించారు. దేశంలో తన కంటే గొప్ప హిందువు మరొకరు లేరని ఎవరు కూడా ఉండరు అని పేర్కొన్నారు. నా జీవితంలో చేసిన త్యాగాలు ఎవరూ ఏ హిందువు కూడా ఇప్పటివరకు చేసి ఉండరని చాలా మందికి అన్నం పెట్టి యాగాలు చేశామని తాను బాజాప్త హిందూవనని ఎవరికీ భయపడేది లేదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

పొద్దున్న లేస్తే గాయత్రీ మంత్రం చదువుతానన్నారు. బీజేపీ వాళ్లు చెబితేనే చదువుతారా? అని ప్రశ్నించారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్రభుత్వ పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం గురించి స్పందిస్తూ సీఏఏతో దేశానికి నష్టమన్నారు. ఇదో పనికిమాలిన లొల్లి అన్నారు. దేశం మునిగి పోయే పరిస్థితి ఉంటే మౌనంగా ఉండకూడదని కేసీఆర్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న ప్రపంచం తో కలిసి అడుగులు వేయాలని స్పష్టం చేశారు.

 

మన దేశానికి చెందిన వాళ్ళు ఇతర దేశాల్లో దాదాపు పది కోట్లకు పైగానే ఉన్నారని వాళ్ల పరిస్థితి ఏమిటని కెసిఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎన్నారై బిల్లు వల్ల దేశం ఆర్థికంగా దెబ్బతింటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో రావడంతో తన కంటే గొప్ప హిందువు అన్ని యాగాలు చేసిన వారు లేరు అని చేసిన కామెంట్లకు ఎన్ఆర్ఐ బిల్ పై చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో నెటిజన్ల సెల్యూట్ కొడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version