ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అన్ని ప్రాంతాలలో అభివృద్ధి జరగాలని సరికొత్త నిర్ణయాలు ఇటీవల తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రాయలసీమ ప్రాంతం కర్నూల్ లో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు స్వయంగా ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వల్లవన్ తెలిపారు. అంతేకాకుండా రెండు నెలల్లో విమాన రాకపోకలు ప్రారంభిస్తామని కారికల వల్లవన్ మీడియాతో తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక హెలికాప్టర్ నుండి కారికల వల్లవన్ ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న క్రమంలో ఎయిర్ పోర్టు అధికారులు సీఈవో నినాశర్మ, ఏపీడీ కైలాష్ మండల్, సీఎస్‌వో జయప్రకాష్, సేఫ్టీ మేనేజర్ విద్యాసాగర్ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి విమానాశ్రయం లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు విమానాశ్రయం లో జరుగుతున్న పనులను పరిశీలించామని దాదాపు సగానికి పైగా పనులు పూర్తయ్యాయని రెండు నెలలో మిగతా పనులు పూర్తి చేసి విమానాల రాకపోకలు ప్రారంభిస్తామని ఆమె చెప్పారు. అయితే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ కింద ఎయిర్‌పోర్టును గుర్తించినట్టు, దాని ద్వారా నిర్వహణ వ్యయం తగ్గుతుందని ఆమె తెలిపారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయానికి నిధులు విడుదల చేస్తామని తెలిపారు. అంతేకాకుండా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నిధుల ద్వారా ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ హబ్, ఎయిర్‌పోర్టు సిటీ అభివృద్ధి తో పాటు ఏవియేషన్ అకాడమీ… పైలట్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసి శిక్షణా తరగతులు ఏపీ ప్రభుత్వం నిర్వహించబోతున్నట్లు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు.