BREAKING : మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు ప్రారంభించిన కేసీఆర్‌..15 లక్షల ఎకరాలకు సాగునీరు

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… కాసేపటి క్రితమే మల్లన్న సాగర్ ప్రాజెక్టు ను ప్రారంభించారు. సిద్దిపేట జిల్లాలో ఉన్న ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టు ను ప్రారంభించి… జాతికి అంకితం చేశారు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు. కాలేశ్వరం ప్రాజెక్టు అతి పెద్ద జలాశయం గా మల్లన్నసాగర్ పేరుగాంచింది.

ప్రపంచం లోనే.. అతి పెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకం కాలేశ్వరం ప్రాజెక్ట్ కావడం విశేషం. కాలేశ్వరం తో పాటు 13 జిల్లాలకు సాగు అలాగే తాగునీరు అందిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ మల్లన్న సాగర్ ప్రాజెక్టు సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

మల్లన్న సాగర్ ప్రాజెక్టు 50 టీఎంసీల సామర్థ్యం ఉంది. ఈ ప్రాజెక్టు కారణంగా ఏకంగా 15 లక్షల ఎకరాలకు నీరు అందనుంది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా, నల్గొండ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది.మ‌ల్లన్నసాగ‌ర్ ప్రారంభంతో కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప‌రిపూర్ణం అయింది. మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు పూర్తి చేసింది కేసీఆర్‌ సర్కార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version