దేశానికే ట్రెండ్ సెట్టర్ మన ‘ధరణి’ : సీఎం కేసీఆర్

-

ధరణి పోర్టల్ ను ‌సీఎం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన ధరణి దేశానికి ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తుందన్నారు. పోర్ట‌ల్ ప్రారంభం కంటే ముందు కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. మేడ్చ‌ల్ జిల్లా మూడుచింత‌ల‌ప‌ల్లిలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు భూమి ఉత్పత్తి సాధనం మాత్రమేనన్న ఆయన సాగు విధానంలో అధునాతన మార్పులు వచ్చి అది ఆస్తిగా మారిందన్నారు.

రైతుల భూములకు సంపూర్ణ రక్షణ ఉండాలని ధరణి పోర్టల్‌ రూపకల్పన చేశామని అన్నారు. ఈ పోర్టల్ వలన మోసాలకు ఆస్కారమే ఉండదని, గందరగోళం అనే మాటే వినపడదని అన్నారు. పక్కాగా.. పారదర్శకంగా.. సులువుగా స్లాట్‌ బుకింగ్‌.. వెరిఫికేషన్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ వరకు..అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుందని ఆయన అన్నారు. ప్రతి అంగుళం భద్రంగా నిక్షిప్తం.. పది నిమిషాల్లోనే పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చేలా ప్రపంచంలో ఏ మూలన ఉన్నా భూమి వివరాలు తెలుసుకునే అవకాశం ఈ ధరణి కల్పించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version