తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఏకాంతంగా భేటీ అయ్యారు. నిన్న స్వయంగా తనంతట తానే రేంజ్ రోవర్ కారు నడుపుకుంటూ ప్రగతి భవన్ కు వచ్చిన అసదుద్దీన్ ఓవైసీ చాలా సేపు కేసీఆర్ తో ఏకాంతంగా భేటీ అయ్యారు. అయితే గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. డిసెంబరు మొదటి వారంలో గ్రేటర్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతోంది.
ఇక నిన్న పార్టీలోని ప్రధాన కార్యదర్శులు కీలక నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు ఈరోజు క్యాబినెట్ మీటింగ్ కూడా నిర్వహించేందుకు కేసీఆర్ సిద్దం అవుతున్నారు. ఈ నేపధ్యంలో వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది. ఈరోజు క్యాబినెట్ భేటీలో ఎన్నికలకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలని అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని చెప్పక తప్పదు. చూడాలి మరి ఏమవుతుందో ?