ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు. ధనానికి అధిదేవత అయిన శ్రీ లక్ష్మీదేవి అంతటా వ్యాపించి ఉంటుంది. అయితే ఆయా స్థానాలలో, కొన్ని పనులు చేసే దగ్గర ఎక్కువగా ఉంటుందని పెద్దలు చెప్తారు. ఆ ప్రదేశాల గురించి తెలుసుకుందాం…
నారదుడు శ్రీ మహావిష్ణువుని శ్రీలక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది అని అడుగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవి ఎక్కడెక్కడ ఉంటుందో ఆ స్థానాలు…
అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అధీనంలో ఉంటే , నేను నా భక్తుల అదీనంలో ఉంటాను . మీరు నా భక్తులు, కనుక మీకు పరమైస్వర్యాన్ని అందించే ఆచలలక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు వినండి – అంటూ లక్ష్మి ఎవరెవరి వద్ద ఉంటుందో, ఎవరివద్ద వుండదో, వివరించాడు. ధనదేవత అయిన శ్రీలక్ష్మీని కోరుకునే వారందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవే…
శంఖద్వని వినిపించని చోటా, తులసిని పూజించని చోట, శంఖరుని అర్చించని చోట, బ్రహ్మవేత్తలకు , అతిధులకు భోజన సత్కారాలు జరగని చోట. లక్ష్మి దేవి నివసించదు. ఇల్లు కళ కళ లాడుతూ ఉండని చోట. ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట. విష్ణువును ఆరాధించకుండ. ఏకాదశి జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు. హృదయములో పవిత్రత లోపించిన, ఇతరులను హింసింస్తున్న. ఉత్తములను నిందిస్తున్న లక్ష్మి ఆ ఇంటిలోనుంచి పారిపోతుంది. భగవద్భాక్తులపై కోపగించే వారి గృహంలో లక్ష్మిదేవే కాదు.శ్రీ హరి కుడా ఉండదు.
లక్ష్మీదేవి ఉండే చోటు…
శ్రీహరి దివ్యచరిత్ర, గుణగానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖద్వని ఉన్నచోట , లక్ష్మీదేవి నివసిస్తుంది. అంతేకాకుండా భక్తులను, పండితులను, విద్యావేత్తలను, మహిళలు, పిల్లలను ఆదరించే చోట లక్ష్మీదేవి నివసిస్తుంది. ఇళ్లు శుభ్రంగా ఉన్నచోట, ప్రశాంత వాతావరణం, పసుపు, కుంకుమ వంటి సుమంగళపదార్థాలు ఉన్నచోట, ఉప్పు, తాటాకులు, మహిళల పాపిడి, మాంగళ్యం, గాజులు, దీపం వంటి ప్రదేశాలలో లక్ష్మీ నివసిస్తుందని పెద్దలు పేర్కొన్నారు.
-శ్రీ