తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణాలో కేసులు అదుపులోనే ఉన్నా అవి మరింతగా పెరిగితే ఎం చెయ్యాలి అనే ఆలోచన కేసీఆర్ చేస్తున్నారు. ప్రజలకు కరోనా రాకుండా ఉండటానికి ఇప్పటికే ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారులను అప్రమత్తం చేస్తున్నారు కేసీఆర్…
ఇప్పుడు ప్రజలు ఎవరిని కూడా బయటకు రాకుండా చూసే ప్రయత్నాలు చేస్తున్నారు కేసీఆర్. మెడికల్ కోసం బయటకు రావొద్దని భావిస్తున్న ఆయన… గ్రామంలో కొందరిని నియమించాలి అని భావిస్తున్నారు. స్వచ్చందంగా ముందుకి వచ్చిన వాళ్ళ ప్రాణాలకు భద్రత కల్పిస్తూనే వారి సేవలను అన్ని విధాలుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లకు ఇన్ని ఇల్లు అని అప్పగిస్తారు.
వాళ్లకు ఆ ఇళ్ళ బాధ్యతను అప్పగించి వారికి అవసరమైన సరుకులను మందులను వాళ్ళే సరఫరా చేస్తారు. దీనితో ప్రజలు ఏ చిన్న అవసరాలకు బయటకు రాకుండా చూడవచ్చు. ఇక ఈ సమయంలోనే వారి కుటుంబాల భారం మొత్తం ప్రభుత్వమే చూస్తుంది. వారిని రెవెన్యు ఉద్యోగులకు అనుసంధానం చేస్తారు. దీనిపై ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ముందు దీన్ని హైదరాబాద్ లో అమలు చెయ్యాలని చూస్తున్నారు.