ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించి… రూ.102 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులు ప్రారంభించారు. 56 రకాల ఆరోగ్య పరీక్షలు రేడియాలజీ, పతలాజి ల్యాబ్ లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…సీఎం కెసిఆర్ మీకు మరో వరం ఇచ్చారని… కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు ప్రారంభించబోతున్నట్లు ప్రకనట చేశారు.
8 జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్ పంపిణీ పథకం అమలు చేయబోతున్నామని.. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెంచిన ఘనత సీఎం కెసిఆర్ ది అని కొనియాడారు. 70 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరగాలని.. అన్ని రకాల మందులు రోగులకు అందుబాటులో ఉంచడం కెసిఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రం ముందు వరుసలో ఉండేందుకు కలిసికట్టుగా పని చేస్తామని.. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు రోగ నిర్దారణ కోసం ఈ ల్యాబ్ లు ఉపయోగ పడుతాయన్నారు. 200 పడకల ఆస్పత్రి ఆవరణలోనే మెడికల్ కాలేజీ వస్తుందని.. వారం రోజుల్లో డయాలసిస్ సెంటర్ మంజూరు ఇస్తామని వెల్లడించారు.