కెసిఆర్ శవ రాజకీయాలకు తెరలేపారు: ఈటెల రాజేందర్

-

తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారే అని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. తమ ఆటలు ఇక సాగవు అని భావించిన సీఎం కేసీఆర్ పీకే ను పెట్టుకున్నాడని.. ఎవరు ఏం చేసినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ లో ఓ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కు హాజరయ్యారు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ..

ఉద్యోగం వస్తుందో, రాదో అన్న బాధలో ఎందరో యువకులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏనాడూ ఆ కుటుంబాలను కనీసం టీఆర్ఎస్ నేతలు పరామర్శించలేదని విమర్శించారు. కెసిఆర్ శవ రాజకీయాలకు తెరలేపారు అని ఆయన మండిపడ్డారు. చీమ చిటుక్కుమన్నా మఫ్టీలో కూడా పట్టుకునేందుకు సిద్ధంగా ఉండే పోలీసులు మూడు వేల మంది వాట్సాప్ లో మెసేజ్లు పెట్టుకుంటూ ఒక్కసారిగా రైల్వే స్టేషన్ లోకి చొరబడితే ఆపలేక ఎక్కడ పోయారని ప్రశ్నించారు.

టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఆస్తుల విధ్వంసం జరగడమే కాకుండా కాల్పుల్లో యువకుడు మృతి చెందాడని అన్నారు. కెసిఆర్ ఎన్ని నాటకాలు ఆడినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ఈటెల స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version