కరోనా విషయంలో కఠినంగా ఉంటాం; కెసిఆర్

-

కరోనా వైరస్ పై సమీక్ష తర్వాత తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాష్ట్రంలో వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. నిర్లక్ష్యం చేసిన వారిలోనే కరోనా వైరస్ విస్తరించిందని అన్నారు. ఎవరైతే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే సరెండర్ అవ్వాలని, అలా అయితే మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవచ్చు అని కెసిఆర్ అన్నారు.

ముందు జాగ్రత్త తీసుకొని దేశాల్లోనే కరోనా వైరస్ తీవ్రంగా ఉందని అన్నారు. కరోనా విషయంలో చాలా కఠినంగా ఉంటామని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో దిగి వేర్వేరు మార్గాల్లో వస్తున్నారని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళను గుర్తించాలని ఆదేశించినట్టు చెప్పారు. మార్చ్ 31 వరకు అన్ని ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసారు. ఇప్పటి వరకు తెలంగాణాలో కరోనా 14 మందికి సోకిందని చెప్పారు.

మనకు ఆ ఇబ్బంది రావొద్దని చర్యలు తీసుకున్నామని అన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలకు ప్రజలను అనుమతించవద్దని ఆదేశించినట్టు చెప్పారు. 25 వ తేదీన ఉగాది ప్రభుత్వం తరుపున నిర్వహించవద్దని చెప్పామని అన్నారు. ఉగాది శ్రీరామనవమి ఉత్సవాలని రద్దు చేసామని చెప్పారు. హైదరాబాద్ లో 1160 మంది క్వారంటైన్ చేసామని అన్నారు కెసిఆర్. విదేశాల నుంచి ఎవరు వచ్చినా క్వారంటైన్ నిర్వహించాలని ఆదేశించామని అన్నారు.

గతంలో బంద్ చేసిన వాటిపై 31 వరకు ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసారు. రాష్ట్రం సరిహద్దుల్లో 18 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళను హోం క్వారంటైన్ చేస్తున్నామని అన్నారు. అట్టహాసంగా మతపరమైన కార్యక్రమాలు నిర్వహించవద్దని కెసిఆర్ సూచించారు. పరిక్షా కేంద్రాలకు శానిటేషన్ నిర్వహించాలని సూచించామని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాలను శానిటేషన్ చేస్తున్నామని అన్నారు.

పబ్లిక్ సర్వీసులకు వెంటనే శానిటేషన్ చేస్తున్నామని చెప్పారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుని నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. మన రాష్ట్రంలో విదేశీయులకే కరోనా వచ్చిందని అన్నారు. పదో తరగతి పరిక్ష హాల్స్ కి రోజూ శానిటేషన్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ రోజు నుంచి పదో తరగతి పరిక్షలు మొదలయ్యాయని అన్నారు. బయట దేశాల నుంచి వచ్చిన వారికే కరోనా లక్షణాలు ఉన్నాయని అన్నారు. మాల్స్ మూసే ప్రసక్తే లేదని, కృత్రిమ కొరత సృష్టించవద్దు అని అన్నారు.

తెలంగాణకు సరిహద్దులు ఎక్కువగా ఉన్నాయని, అందుకే 18 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మాల్స్ లో ఎక్కువ రద్దీ లేకుండా చూడాలని అన్నారు. జనసమూహం ఉన్న చోట ఉండవద్దని అన్నారు. ముందే నిర్దేశించిన పెళ్ళిళ్ళను చేసుకోవాలని కొత్త పెళ్ళిళ్ళు చేసుకోవాలని సూచించారు. కలెక్టర్లు, డీహెచ్ఎంవోలతో కమిటీలు వేశామని అన్నారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులతో కూడా మాట్లాడమని అన్నారు.

దయచేసి ఎక్కువ గుమిగూడకుండా ఉంటే మనకే మంచిది, జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ వ్యాపించదని అన్నారు. పరిక్షా కేంద్రాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచుతామని కెసిఆర్ అన్నారు. సూపర్ మార్కెట్లకు ఎటువంటి ఆంక్షలు విధించలేదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మ్యారేజ్ హాల్స్ మూసి వేయాలని ఆదేశాలిచ్చారు. ఇప్పటి వరకు కుదిరిన పెళ్లిళ్లకు 200 మందికి మించకుండా చేసుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version