తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఒకరిమీద ఒకరు గత కొంత కాలం నుండి విమర్శలు చేస్తూనే ఉన్నారు. కారణం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పగ్గాలు చేపట్టాలని ఎవరికి వారు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రెచ్చిపోయారు. ఇదిలా ఉండగా బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి జైలు నుండి రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసినదే. ఆ తరువాత ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి తన కార్యకర్తలతో సమావేశమై షాకింగ్ కామెంట్లు చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తూ తనపై పరోక్షంగా కుట్రలు చేస్తున్నారని విమర్శలు చేశారు.
ఇదిలా ఉండగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు కాంగ్రెస్ నుండి పూర్తిగా రేవంత్ రెడ్డి ని బయటకు గెంటి వేయడం కోసం భారీ స్కెచ్ వేసినట్లు సరికొత్తగా వార్తలు వినబడుతున్నాయి. ఇలాగే పార్టీలో ఉంటే ఉన్న కొద్ది రెచ్చిపోతాడు అని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అంతా కలిసి రేవంత్ రెడ్డి పై సరికొత్త వ్యూహం పన్నుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.