సీఎం కేసీఆర్ (CM KCR) ఏ పనిచేసినా దానికి ఓ బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆయన భవిష్యత్ ఫలితాన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇప్పుడు కూడా ఈటల రాజేందర్ వ్యవహారంలో చాలా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ కరోనా సమయంలో ఈటల ను బర్తరఫ్ చేశాక ఆయన చాలా రకాల వరాలు కురిపిస్తున్నారు. ఎంతో యాక్టివ్‌గా కరోనాపై పనిచేస్తున్నారు. వీటన్నింటికీ రాబోయే కాలంలో ఉప ఎన్నికే కారణమని తెలుస్తోంది.
ఎన్నడూ లేనిది గాంధీ, ఎంజీఎం ఆస్పత్రులను సందర్శించడం దగ్గరి నుంచి, రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటు అలాగే పీఆర్సీ అమలు, కొవిడ్ నేపథ్యంలో డయాగ్నోస్టిక్ సెంటర్ల ఏర్పాటు లాంటి అనేక చర్యలు తీసుకుంటూ పాజిటివ్ వేవ్ పెంచుకుంటున్నారు కేసీఆర్.
ఇప్పుడు ఈటల రాజేందర్‌కు ప్రజల్లో బాగా బలం, సానుభూతి పెరిగాయి. కాబట్టి వాటిన తట్టుకుని వచ్చే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో దెబ్బకొట్టాలంటే వ్యూహాత్మకంగా వ్యవరించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అందుకే వరుసపెట్టి వరాలు ప్రకటిస్తున్నారు కేవలం హుజూరాబాద్‌కు నిధులు కేటాయించినా ఇప్పుడే గుర్తుకొచ్చిందా అంటూ విమర్శలు వస్తాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టి పార్టీకి పాజిటివ్ వేవ్ సృష్టిస్తున్నారు కేసీఆర్. ఆ తర్వాత ఉప ఎన్నిక వచ్చినా గెలుస్తామని కేసీర్ ధీమా.