కేసీఆర్ 2019 ప్లాన్ రిపీట్..వైసీపీలోకి టీడీపీ నేతలు?

-

తెలంగాణలోకి టీడీపీ అధినేత చంద్రబాబు మళ్ళీ ఎంట్రీ ఇవ్వడం వల్ల పరోక్షంగా అధికార బీఆర్ఎస్ లో టెన్షన్ మొదలైందని చెప్పవచ్చు. అదేంటి తెలంగాణలో టీడీపీకి బలం తగ్గిపోయింది..ఒక్క సీటు కూడా గెలుచుకునే బలం లేదు కదా..మరి అలాంటప్పుడు బాబు ఇక్కడకు వచ్చి రాజకీయాలు చేస్తే కేసీఆర్‌కు ఇబ్బంది ఏంటి అని అనుకోవచ్చు.

ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది..అవును తెలంగాణలో టీడీపీ బలం తగ్గింది..ఒక్క సీటు కూడా గెలుచుకునే బలం లేదు..కానీ ఇటీవల ఖమ్మం సభ చూశాక..తెలంగాణలో టీడీపీని అభిమానించే వారు ఇంకా ఉన్నారని అర్ధమైంది. పైగా ఇతర పార్టీల్లోకి వెళ్ళిన టీడీపీ నాయకులని మళ్ళీ తిరిగి రావాలని బాబు కోరారు.

అంతే ఇంకా దాంతో బీఆర్ఎస్ నేతలు వరుసపెట్టి ప్రెస్ మీట్లు పెట్టి బాబుపై విమర్శలు చేశారు. కానీ బాబు..కేసీఆర్ ఊసు గాని. బీఆర్ఎస్ ఊసు గాని తీయలేదు. ఒక్క విమర్శ చేయలేదు. బీఆర్ఎస్ నేతలు మాత్రం బాబుని టార్గెట్ చేశారు. దీనికి కారణాలు ఉన్నాయి. మళ్ళీ బాబు పిలుపుతో ఎవరైనా నాయకులు వెనక్కి వెళితే బీఆర్ఎస్‌కే నష్టం. ఎందుకంటే టీడీపీ మెజారిటీ నాయకులు బీఆర్ఎస్ లోకే వెళ్లారు.

అలాగే కొద్దో గొప్పో పార్టీ బలపడి..హైదరాబాద్, ఖమ్మం లాంటి జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి 5-10 వేల ఓటు బ్యాంక్ చొప్పున ఉంటే చాలు..దెబ్బకు బీఆర్ఎస్‌కు నష్టం జరుగుతుంది. అసలే పోటీ ఎక్కువగా ఉంది..ఈ సమయంలో ఒక్క ఓటు కూడా ముఖ్యమే ఈ సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి 5 వేల ఓట్లు చొప్పున పడిన చాలు బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్.

అందుకే బాబు మళ్ళీ తెలంగాణకు రాకుండా చేయాలని కేసీఆర్ చూస్తున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ లో వ్యాపారాలు ఉన్న టీడీపీ నేతలని టార్గెట్ చేసి..వారిని వైసీపీలోకి హెచ్చరిస్తున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల ముందు కూడా కేసీఆర్ ఇలాంటి స్కెచ్ అమలు చేశారని ప్రచారం ఉంది. మళ్ళీ ఇప్పుడు అదే ప్లాన్ తో బాబుకు చెక్ పెట్టాలని కేసీఆర్ చూస్తున్నారట. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version