కరోనా వైరస్ పుణ్యమా అని లాక్ డౌన్ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ దెబ్బకు ప్రభుత్వాల ఆదాయం భారీగా పడిపోయింది. దీనితో ఆర్ధికంగా బలంగా ఉన్న రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నాయి. కేంద్ర రాష్ట్ర పభుత్వాలు ఈ లాక్ డౌన్ దెబ్బకు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఆదాయ వచ్చే రాష్ట్రాలు ఇప్పుడు ఇబ్బంది పడటంతో ఉద్యోగులకు జీతాలను కట్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాలు ఉద్యోగులకు జీతాలను కట్ చేసాయి. తెలంగాణా ప్రభుత్వం ప్రజాప్రతినిధుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు భారీగా జీతాలు తగ్గించారు. 50 శాతం మేర జీతాలు తగ్గాయి. ముందు కోత అన్నా ఆ తర్వాత వాయిదా అని పేర్కొన్నారు. దీని నుంచి కొందరు ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మినహాయించింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో వైద్యారోగ్య, పోలీసు శాఖ ఉద్యోగులను మినహాయించనున్నారు.
కరోనా వైరస్ కట్టడి కోసం వీళ్ళు చాలా కష్టపడుతున్నారు. నిత్యం వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. కనీసం ఇంటికి కూడా వెళ్ళకుండా సేవలు అందిస్తున్నారు. వైద్యులు అయితే బయటకు చెప్పలేని నరకంలో ఉన్నారు. దీనితో వాళ్ళ కష్టాన్ని గుర్తించిన కేసీఆర్ వారిని మినహాయించారు. శుక్రవారం ఆర్థిక శాఖ వారిని మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో పోలీసు, వైద్యారోగ్య శాఖలకు మినహాయింపునిస్తున్నట్టు స్పష్టంగా పేర్కొంది.