కొంచెం టైం ఇవ్వండి.. ఎలెక్షన్ కమిషన్ కి కేసీఆర్ రిక్వెస్ట్..!

-

రానున్న లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడానికి ప్రజల లోకి వెళ్తున్నారు కేసీఆర్. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న జాప్యాన్ని బహిరంగ సభల ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సిరిసిల్ల లో పర్యటించిన ఆయన అధికార కాంగ్రెస్ మీద విరుచుకు పడ్డారు. రేవంత్ రెడ్డి టార్గెట్ గా చేసుకుని కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేసారని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు.

KCR’s key decision on B forms of BRS MP candidates

ఈ మేరకు ఫిర్యాదుని స్వీకరించి ఈసీ ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించిందని ఆ వ్యాఖ్యలుకు వివరణ ఇవ్వాలని బుధవారం రాత్రి మాజీ సీఎం కేసీఆర్ కి నోటీసులని పంపించారు అందుకు ఆయన స్పందించి వివరణ ఇవ్వడానికి ఇంకో వారం రోజులు గడువు కావాలని తాజాగా ఎలక్షన్ కమిషన్ ని రిక్వెస్ట్ చేశారు ఆయన అభ్యర్థన పట్ల ఈసీఎల్ రియాక్ట్ అవుతుందనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news