మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి దొందూదొందేనని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నల్గొండ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేసీఆర్, రేవంత్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని.. మాజీ సీఎం రూ.7 లక్షల కోట్లు అప్పు చేసి రేవంత్ రెడ్డి చేతుల్లో పెడితే, ప్రస్తుత సీఎం అనుభవం లేక రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలో పడేశారని ఫైర్ అయ్యారు.
కనీసం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్ ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ కోసం కోర్టుకు వెళ్ళి సాధించుకోవాల్సిన దారుణ ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని విమర్శించారు.ప్రభుత్వ ఉద్యోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదని, బిల్లులు చెల్లించకపోవడంతో ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఆస్పత్రులు పట్టించుకోవడం లేదన్నారు.