కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి విమర్శలను దేశవ్యాప్తంగా ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ విఫలమైందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి మొదలైందని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ చేయలేదని అన్నారు.కాంగ్రెస్ ఎందుకు గెలిపించుకున్నామని ప్రజలు, అధికారులు బాధపడుతున్నారని పోచారం విమర్శించారు.
కేసీఆర్ పదేళ్ల పాటు ఒక స్వర్ణయుగంలా పాలించారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కార్యకర్తలే పార్టీలకు కీలకము, వారిని కాపాడుకోవాల్సి బాధ్యత నాయకులపై ఉందని అన్నారు. పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ ఉంది..బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగే సంస్కృతి బీజేపీ పార్టీదీ అని విమర్శించారు. గాలా అనిల్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు.