తెలంగాణలో రైతులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు : కేసీఆర్

-

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టేది లేదని బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. సూర్యాపేటలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రణరంగమైనా ప్రభుత్వం మెడలు వంచుతాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. మహాసముద్రంలాంటి బీఆర్ఎస్ పార్టీ రైతుల తరుఫున పోరాడుతోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ దళాలు తిరుతుగున్నాయి. మిమ్మల్ని వెంటాడుతాం.. తరుముతాం. లెక్కలన్నీ తీసి బజారులోకి ఈడుస్తాం.” అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ కీలక విజ్ఞప్తి చేశారు. చేతులు ఎత్తి మొక్కుతున్న.. దయచేసి తెలంగాణలో రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు.

రైతుల తరుపున పోరాడేందుకు బీర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఉన్నారని ధైర్యం చెప్పారు. రణరంగమైన రైతుల కోసం ప్రభుత్వంతో పోరాడుతామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొకోవాలన్నారు. పంట నష్టం పోయిన రైతులకు ఎకరాకు ప్రభుత్వం రూ.25 వేలు ఇవ్వాలని ఈ సందర్భంగా కేసీఆర్ డిమాండ్ చేశారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. మరీ డిసెంబర్ 9 వెళ్లిపోయి ఎన్ని రోజులయ్యిందని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ నిద్రపోతున్నావన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 1.8 శాతం తేడాతో మీరు గట్టెక్కారని.. మిమ్మల్ని నిద్రపోనివ్వమని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version