తెలంగాణ సిఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా అమరులు అయిన కుటుంబాలకు సంగీభావం తెలుపుతున్నామని పేర్కొన్నారు సిఎం కెసిఆర్. అంతే కాదు వారి కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని.. అమరులైన రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.. 3 లక్షల ఎక్స్ గ్రేషియా అంద జేస్తామని కీలక ప్రకటన చేశారు.
అందుకు రూ. 22.50 కోట్లు తెలంగాణ ప్రభుత్వం కేటాయిస్తుందని ఆయన స్పష్టం చేశారు. . కేంద్రం కూడా ఆ కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. రైతుల పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని.. దీన్ని కేంద్రం పాజిటివ్ గా తీసుకోవాలి.. నెగిటివ్ గా తీసుకోవద్దని వెల్లడించారు.
ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయాలని… అలాగే బీసీ కులగణన చేయాలని డిమాండ్ చేశారు. లెక్కలు దాచిపెట్టాలని భావించడం ఏంటి? పారదర్శకత కావాలనే కేంద్రం.. ఎవరి జనాభా ఎంత వుందో లెక్కతేల్చాలన్నారు. ఎందుకు వారి జనాభా దాచిపెట్టాలని.. ఇదేం బ్రహ్మపదార్థం కాదని వెల్లడించారు.