షాకింగ్; కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే తీసుకున్న జగన్…?

-

రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ తలా చేయి వెయ్యాలని చెప్పిన తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, పించన్ దారుల జీతాల్లో కోత విధించారు. అందరి జీతాల్లోను 50 శాతం పైగా కొత విధించడం తో ఇప్పుడు అక్కడ ఉద్యోగులు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. కెసిఆర్ ప్రధానంగా ఈ నిర్ణయం రైతుల కోసం తీసుకున్నారు.

రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చెయ్యాలి అంటే రాష్ట్రానికి డబ్బు కావాలి కాబట్టి కేసీఆర్ రెండో ఆలోచన లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. తెలంగాణా ఏ నిర్ణయం అయితే తీసుకుందో అదే నిర్ణయం తాను కూడా తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది.

అక్కడ ఆదాయ వనరులు కూడా తక్కువగానే ఉన్నాయి. ప్రజలకు రేషన్ ఇవ్వడానికి కూడా ఏపీ ఇబ్బంది పడుతుంది. అందుకే ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వ బాటలోనే తాను కూడా వెళ్ళాలి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులతో ఆయన ఈ మేరకు ఒక సమావేశం కూడా నిర్వహించారని సమాచారం. దీనిపై సాధ్యా సాద్యాలను పరిశీలించి ఎవరి జీతాల్లో ఎంత కోత అనేది ప్రకటన రానుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version