గజ్వేల్ నుంచి తప్పుకుంటున్న కేసీఆర్..వచ్చే ఎన్నికల్లో ఆ నియోజక వర్గం నుంచి పోటీ !

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజక వర్గాన్ని సీఎం కేసీఆర్‌ విడనున్నట్లు ప్రగతి భవన్‌ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనే సీఎం కేసీఆర్‌.. గజ్వేల్‌ నియోజక వర్గాన్ని వదిలేసి.. దక్షిణ తెలంగాణ లోని ఓ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట.

మొదట్లో అలేరు నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని మొదట్లో వార్తలు వచ్చాయి. అందుకే యాదాద్రి అభివృద్ది చేస్తున్నట్లు కూడా సమాచారం వచ్చింది. అయితే.. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ తన ప్లాన్‌ పూర్తి గా మార్చేశారట.

నల్గొండ లోని మునుగోడు నియోజక వర్గం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారని టాక్‌. ప్రస్తుతం కాంగ్రెస్‌ నేత రాజగోపాల్‌ అక్కడ ఎమ్మెల్యే గా పని చేస్తున్నారు. గతంలో మునుగోడు టీఆర్‌ఎస్‌ స్థానమే. అందుకే.. తానే అక్కడి నుంచి పోటీ చేసి.. గెలువాలని కేసీఆర్‌ ప్లాన్‌ వేశారట. అంతేకాదు.. గజ్వేల్‌ నుంచి కవితకు టికెట్‌ ఇచ్చే ఛాన్స్‌ ఉందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version