తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు చెబుతున్నారు. ఎక్కువగా ఈ కేసులు స్కూల్స్, హాస్టల్స్ లో నమోదవుతున్న కారణంగా తరగతి లోపు పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాలు మూసివేస్తే మేలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెబుతున్నారు.
అయితే ఈ ప్రతిపాదనల మీద కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 700 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు చెబుతున్నారు. నిజానికి పిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. పాజిటివ్ ఉన్నా లక్షణాలు బయటికి కనిపించవు. దీంతో వీరంతా తరగతులకు హాజరు అయి ఇళ్లకు తిరిగి వెళ్ళేటప్పుడు కుటుంబ సభ్యులకు కరోనా వ్యాపించడానికి వాహకాలవుతున్నారని వైద్యుల అంచనా. అందువల్ల ఈ నెల మొదటి నుండే కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది అని భావిస్తున్నారు.