ఎల్ ఆర్ ఎస్ ను వెనక్కు తీసుకోనున్న తెలంగాణ సర్కార్ ?

-

ఎల్ ఆర్ ఎస్ పై తెలంగాణ సర్కార్ వెనక్కి తగ్గే అవకాశం కనిపిస్తోంది. నేడో రేపో ఈమేరకు కేసిఆర్ కీలక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ప్రజలకు ఎల్ఆర్ఎస్ ఫీజు భారంగా మారినట్టు సమాచారం. ఎల్ఆర్ఎస్ కోసం  25,59,562 లక్షల ధరఖాస్తులు రావడంతో 20 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. అయితే రియల్టర్స్ అసోసియోషన్లు ఎల్ఆర్ఎస్ రద్ధు కోసం ఆందోళనల బాట పట్టాయి.

CM KCR

రేపు జాతీయ రహదారుల దిగ్బంధనానికి కూడా పిలుపునిచ్చారు. జనవరి 2 న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయల ముందు రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చారు. ప్రజల నుండి కూడా తీవ్ర వ్యతిరేకత రావడంతో దిద్దుబాటు చర్యలకు కేసిఆర్ కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు. అందుకు గాను 4 ఆప్షన్లను కేసిఆర్ పరిశీలిస్తున్నారు. ఎల్ ఆర్ ఎస్ ను పూర్తిగా ఎత్తివేయడం లేదా ఉచితంగానే రెగ్యులరైజ్ చేయడం, లేదా ఫీజు ను తగ్గించడం లేదా.. ముందు కొంత ఫీజు కట్టించుకుని మిగతా ఫీజును నిర్మాణ సమయంలో చెల్లించే వెసులుబాటు ఇచ్చే అంశాల మీద కేసిఆర్ కసరత్తులు చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version