కరోనా వచ్చినప్పుటి నుంచి ప్రతి ఒక్కరూ వర్క్‌ఫ్రమ్ హోమ్‌లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఏది కోనాలన్నా.. అమ్మలన్నా ఫోన్లు, ట్యాప్‌టాప్‌లతోనే డిజిటల్ లావాదేవీలు జరపుతున్నారు. ఫోన్ల నుంచే బ్యాంకింగ్ సేవలు, డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం జరుపుతున్నారు. షాపింగ్, సినిమా టికెట్స్, ఫుడ్ ప్రతి ఒక్కటీ డిజిటల్ లావాదేవీలే. దీంతో మన సమాచారానికి భద్రతాకు రిస్క్ ఉండే అవకాశం లేకపోలేదు. ట్యాప్‌టాప్, ఫోన్ల ద్వారా మనం జరిపే లావాదేవీల సమయంలో సైబర్ నేరగాళ్లు కీలక సమాచారాన్ని హాక్ చేసేందుకు పలు మర్గాలు అన్వేషిస్తుంటారు. ఈ క్రమంలో వినియోగదారులు వారివారి బ్యాంకు ఖాతాలు, కార్డులు, ఫోన్లు, వ్యాలెట్‌లకు భద్రత ఉందా.. అని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
కొన్ని రోజుల క్రితం ఓ ఈ కామర్స్ పోర్టల్‌కు సంబంధించి రూ.2 కోట్ల వినియోగదారుల వ్యక్తిగత వివరాలు బయటకు పొక్కి వాటిని డార్క్ వెబ్‌లో అమ్మకానికి సైతం పెట్టడం జరిగింది. ఆగస్టులో రూ. 3,69,000 బ్యాంకింగ్ ఖాతాదారుల వివరాలను అపహరించేందుకు ఓ పయత్నం జరిగింది. ఏకంగా దేశ ప్రధాని ట్విట్టర్ ఖాతాయే హ్యాకింగ్‌కు గురైందంటే ఏ రేంజ్‌లో సైబర్ గాళ్లు వల పన్నుతున్నారో అర్థమవుతుంది.
రక్షణ అవసరం..
స్మార్ట్ ఫోన్లు తదితర పరికరాలను వాడే వారిలో మాల్వేర్, ఫైర్‌వాల్స్ విషయంలో రక్షణ ఎక్కువ మందికి అవగాహన ఉండదు. కార్యాలయాల్లో వాడే కంప్యూటర్లు ఫోన్లకు భద్రత ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినప్పటి నుంచి సైబర్ ఇన్సూరెన్స్‌కు ఆదరణ పెరుగుతోంది. దీంతో వారు వివిధ కంపెనీలు, స్కీమ్‌లు, ఇన్సురెన్స్ పేర్లతో మెసెజ్‌లు పంపిస్తారు. వాటిని క్లిక్ చేయగానే మన వ్యక్తిగత సమాచారమంతా వాటి చేతిలోకి వెళ్లిపోతుంది. సైబర్ బీమా తీసుకుంటే చాలులే అనుకోవద్దు. ముందు తమకున్న రిస్క్‌లు ఏంటి అని పరిశీలించుకుని, వాటికి కవరేజీనిచ్చే పాలసీని ఎంచుకోవడం ముఖ్యం. దీనికి తోడు అవసరమైన యాడాన్ కవరేజీలను కూడా జతచేసుకోవాలి. ముఖ్యంగా రిస్క్ పరిమాణాన్ని అంచనా వేసుకొని ఇందుకుగాను ఇంటర్నెట్ వేదికపై ఎంత విలువ మేర ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నదీ చూడాల్సి అవసరం ఉందంటున్నారు నిపుణులు.