మీడియాతో చిట్ చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. అధికారం పోయింది అనే బాధతో మాట్లాడినట్టు ఉంది కేసీఆర్ స్పీచ్ అని… కేసీఆర్ స్పీచ్ లో పస లేదని చురకలు అంటించారు. ఈ ప్రపంచంలో ఇందిరా గాంధీకి మించిన యోధురాలు లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్, మోడీ ఇద్దరూ వాళ్ల అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారని వెల్లడించారు.

నాకు, రాహుల్ గాంధీకి మధ్య మంచి రిలేషన్ ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . దీనిపై ఎవరినీ నమ్మించాల్సిన అవసరం నాకు లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలులో లేవు… ఆపరేషన్ కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు. నిన్న సభలో కేసీఆర్ తన అక్కసు మొత్తం కక్కాడు… పిల్లలను కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి పంపుతున్నాడు? అంటూ మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.