ఆర్టీసి సమ్మె, దిశ హత్య కేసు ఘటన… ఈ రెండు పరిణామాలు వాడుకునే ప్రయత్నం చేసాయి కొన్ని శక్తులు… జాతీయ మీడియా బల్లలు చరుస్తూ దేశం లో ఎక్కడా జరగని విధంగా తెలంగాణాలో జరిగింది అంటూ చర్చా వేదికలు పెట్టింది… కెసిఆర్ ని ఆయన మంత్రి వర్గాన్ని, వాళ్ళు చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ తీవ్ర విమర్శలు చేసింది. ఉన్నావ్ అత్యాచార బాధితురాలిని చంపితే ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు జాతీయ మీడియాలో ఒక్క చర్చా వేదిక కూడా నడవలేదు… ఆగ్రహంగా బల్లలు చరవలేదు.
జాతీయ మీడియాలో కెసిఆర్ ని అల్లరి చెయ్యడానికి చాలా ప్రయత్నాలు చేసారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై కెసిఆర్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. మీడియా సమావేశాల విషయంలో గాని, ఫోన్ కాల్స్ మాట్లాడే సమయంలో గాని చాలా జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు జారి చేసినట్టు సమాచారం, ఏ ఛానల్ ఫోన్ చేసినా సరే మాట్లాడొద్దని, అసలు వాళ్లకు అందుబాటులో ఉండొద్దని ఆయన చెప్పారట. ఢిల్లీలో ఎంపీలకు కెసిఆర్ గట్టి హెచ్చరికలు చేసినట్టు సమాచారం. ఏ ఒక్క ఎంపీ కూడా… బిజెపి వాళ్ళతో కనీసం టచ్ లో కూడా ఉండొద్దని,
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఏ మీడియా ఛానల్ వచ్చి పలకరించినా సరే పక్కకు తప్పుకుని పొండి గాని వాళ్ళ మాట కూడా కనీసం వినోద్దని, ఎవరి ఫోన్లకు ఆన్సర్ చేయవద్దని స్పష్టంగా చెప్పారట. మంత్రులు ఏదైనా ఉంటే… పల్లా రాజేశ్వరరెడ్డికి సమాచారం ఇవ్వాలి గాని ఎక్కడా సొంత మాటలు మాట్లాడటం గాని ఎవరికి అవకాశాలు ఇవ్వొద్దని స్పష్టంగా చెప్పారట. రాజకీయంగా బిజెపి మనని లక్ష్యంగా చేసుకుందని, హైదరాబాద్ మీద కూడా తన పట్టుకోసం ప్రయత్నం చేస్తుందని, ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉంటే మంచిది అని హెచ్చరించారట కెసిఆర్.