తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. అసలు హోరాహోరీగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య వార్ నడుస్తోంది. ఈ వార్‌లో కాంగ్రెస్‌ది సైడ్ క్యారెక్టర్ అన్నట్లు పరిస్తితి ఉంది. అసలు హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత పోలిటికల్ సీన్ మొత్తం మారింది. అసలు కేసీఆర్ వ్యూహాత్మకంగా సీన్ మొత్తం మర్చినట్లు కనిపిస్తోంది. ఆయన కేవలం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌నే టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తున్నారు. అసలు ఇందులో కేసీఆర్ వ్యూహం ఏంటి అనేది ఎవరికి క్లారిటీ రావడం లేదు.
అసలు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వార్ జరుగుతున్నట్లు సృష్టించేశారు. ఆయనే స్వయంగా మీడియా సమావేశాలు పెడుతూ కేవలం బండిపైనే విమర్శలు చేస్తున్నారు. గతంలో పెద్ద పెద్ద ప్రత్యర్ధులు ఉన్నా సరే కేసీఆర్ ఈ విధంగా డైరక్ట్ రంగంలోకి దిగిన సందర్భాలు తక్కువ. కానీ ఇప్పుడు డైరక్ట్‌గా రంగంలోకి దిగేశారు. ధాన్యం విషయంపై బీజేపీ వైఖరిని తప్పుబడుతున్నారు. అటు బీజేపీ కూడా ఇదే అంశంపై కేసీఆర్‌పై గట్టిగానే ఫైట్ చేస్తుంది.
అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా కేసీఆర్ వార్ మార్చినట్లు కనిపిస్తోంది. అందులోనూ హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత ఈటల రాజేందర్‌ని హైలైట్ అవ్వకూడదని చెప్పి, బండి సంజయ్‌ని టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు. అదే సమయంలో ఈ వార్‌లో కాంగ్రెస్‌ని అసలు టార్గెట్ చేయడం లేదు. అసలు కాంగ్రెస్ పని అయిపోయిందని అన్నట్లుగా కేసీఆర్ రాజకీయం ఉంది.
చెప్పాలంటే రాష్ట్రంలో బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది. అలాంటప్పుడు కాంగ్రెస్‌ని సైడ్ చేస్తే ఆ పార్టీకి బలం లేనట్లు నిరూపించాలని కేసీఆర్ ప్రయత్నాలుగా ఉన్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వంపై పోరాడితే…అక్కడ బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత రాష్ట్రంలో ఉన్న బీజేపీపై కూడా పడుతుందనేది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తానికైతే కేసీఆర్ కేవలం బండినే టార్గెట్ చేయడం వెనుక అతి పెద్ద వ్యూహమే ఉందని అర్ధమవుతుంది.