ధాన్యం కొనుగోలుపై బీజేపీ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు సీఎం కేసీఆర్. రైతు హంతక పార్టీ అని బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 750 మంది రైతులు చనిపోవడానికి కారణం మీరు కాదా.. అని ప్రశ్నించారు. రైతులపై కార్లు ఎక్కించిన పార్టీ, రైతుల్ని కొట్టండి అని చెప్పే పార్టీ మీది కాాాదా..అని బీజేపీ పార్టీని ప్రశ్నించారు. దిక్కుమాలిన మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి రైతుల్ని ఇబ్బందులు పెట్టింది బీజేపీ పార్టీనే అని విమర్శించారు. మీ ప్రధానినే కదా చివరకు రైతులకు సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
బీజేపీ రాబంధువుల పార్టీ అని.. మాది రైతు బంధువుల పార్టీ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ ఏడాది రా రైస్ ఎంత తీసుకుంటారో అని కూడా కేంద్రం చెప్పడం లేదని అన్నారు. వీళ్లు మంచి చేసేవారు కాదు.. ముంచే వారు అని విమర్శించారు. ప్రాజెక్ట్ లను కట్టించి.. ఆయకట్టు స్థిరీకరణ చేశామని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి దమ్ముంటే కేంద్రంతో ధాన్యం కొనిపించాలని సవాల్ విసిరారు. రాష్ట్రానికి న్యాయం చేయని కేంద్ర మంత్రి ఎందుకు .. ధాన్యం కొనుగోలు చేస్తేనే సిపాయివి అని విమర్శించారు. చెతకాని దద్దమ్మళ్ల, ఉన్మాదిగా కిషన్ రెడ్డి మాట్లాడారని విమర్శించారు. అగ్రికల్చర్ గురించి నీకేం తెలుసు.. మాకు తెలియనిదే గతేడాది కోటి ఎకరాల్లో పంటలు పండించామా..అని కిషన్ రెడ్డికి చురకలు అంటించారు.