ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకు 20 గంటలు పనిచేసే దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను మార్చారని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో నిర్వహించిన టిఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం వన భోజన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతదేశంలోనే నెంబర్ వన్ సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణను చేసిన ఘనత కేసిఆర్ దేనని అన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే గొప్ప చరిత్రగా నిలిచిందన్నారు. తెలంగాణలో సీఎం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు పక్క రాష్ట్రాల ప్రజలు అబ్బురపడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి నాయకుడే తమకు కావాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. దళితులు ఆర్థికంగా ఎదగాలని ప్రపంచంలోనే మొదట దళిత బంధు పథకం పెట్టిన ఘనుడు కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే టిడిపిలో ఉన్న కేసీఆర్ ప్రశ్నించడం మొదలుపెట్టారని గుర్తు చేశారు. కెసిఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో తెలంగాణను సాధించిన నాయకుడు కెసిఆర్ అని కొనియాడారు.