మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 71వ జన్మదినం సందర్భంగా మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తన మేనమాకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
‘కేసీఆర్ తెలంగాణ ఉద్వేగం
కేసీఆర్ తెలంగాణ ఉద్రేకం
కేసీఆర్ తెలంగాణ స్వాభిమానం
కేసీఆర్ జై తెలంగాణ యుద్ధ నినాదం
కేసీఆర్ తెలంగాణ సమున్నత అస్తిత్వం
కేసీఆర్ తెలంగాణ ప్రజా ఉద్యమ పటుత్వం
కేసీఆర్ తెలంగాణ ఆవేశాల అగ్నితత్వం
కేసీఆర్ తెలంగాణ అనురాగాల అమృతత్వం
కేసీఆర్ తెలంగాణ ప్రజాగళం
కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవ రణం
కేసీఆర్ తెలంగాణ నూతన రాష్ట్ర ఆవిష్కరణం
కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభ్యుదయం
కేసీఆర్ తెలంగాణ జనం గుండెల్లో నిత్య సూర్యోదయం
మీరు నా తలనిమిరే తల్లిప్రేమ
నాకు ఎనలేని మమకారం పంచిన మేనమామ
నాకు రాజకీయ చైతన్యాన్ని నేర్పించి
నాలో ప్రజా సేవా సంస్కారాన్ని రంగరించి
నన్ను ఉద్యమ కార్యాచరణలో నడిపించి
నాలోని నాయకత్వ గుణాన్ని ప్రేరేపించి
నాకు పరిపాలనా సామర్థ్యాన్ని కల్పించి
నన్ను చరితార్థుణ్ణి చేసిన మీరు
శత వసంతాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని రాసుకొచ్చారు.