తల్లి దండ్రులందరికీ… స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. పిల్లలను బయటికి తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. తాజాగా ఓ ఈ బుడ్డోడు తల్లిదండ్రులతో బయటకు వచ్చాడు. అయితే.. అదృష్టవశాత్తుగా రోడ్డు ప్రమాదం నుంచి రెప్పపాటులో బయటపడ్డాడు ఆ కుర్రాడు.

దీనికి సంబంధించిన వీడియో ను సోషల్ మీడియాలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పోస్ట్ చేశారు. పిల్లలను బయటికి తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరిక లు జారీ చేశారు. ఏ మాత్రం నిర్లక్ష్యం గా ఉన్నా ప్రమాదాల బారినపడే అవకాశం ఉందంటూ ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియో షేర్ చేసిన సజ్జనార్.. అందరినీ అలర్ట్ చేశారు. దీంతో…. ఆర్టీసీ ఎం డీ సజ్జనార్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
అదృష్టవంతుడు.. రెప్పపాటులో బయటపడ్డాడు.
చిన్నారులను రహదారుల వెంట తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న వారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అందరికీ ఈ బుడ్డోడిలా అదృష్టం వరించదు. pic.twitter.com/p6VCewnMwl
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 16, 2025