వరకట్న వేధింపులు, భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తీవ్ర మనస్తాపం చెందిన ఓ మహిళ పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లిలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. తన భర్త తిరుపతి వరకట్నం కోసం వేధించడం, వేరే మహిళతో రిలేషన్ కారణంగా ఈనెల 14న ఇద్దరు పిల్లలకు గడ్డి మందు తాగించి భార్య హారిక ఆత్మహత్య చేసుకుంది.మృత్యువుతో పోరాడిన ఇద్దరు పిల్లలు కృష్ణాంత్(9),మాయంతలక్ష్మి(8) నిన్న రాత్రి మృతి చెందారు. తిరుపతి వరకట్నం కోసం నిత్యం వేధించేవాడని, మరో మహిళను ఇంటికి తెచ్చుకునే వాడని హారిక తమతో చెప్పి బాధపడేదని..ముగ్గురి మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని హారిక కుటుంబసభ్యులు పోలీసులను వేడుకున్నారు.
వరకట్నపు వేధింపులు, భర్త అక్రమ సంబంధంతో మనస్తాపానికి గురై పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లిలో భర్త తిరుపతి వరకట్నపు వేధింపులు, వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపానికి గురై.. ఈనెల 14న ఇద్దరు పిల్లలకు గడ్డి మందు తాగించి, తాను… pic.twitter.com/ulXu6HXw6z
— Telugu Scribe (@TeluguScribe) February 17, 2025