మద్యం అమ్మకాల విషయంలో కేసీఆర్ నిర్ణయం ఇదే…?

-

తెలంగాణా కేబినేట్ సమావేశం నేడు జరగనుంది. ఈ కేబినేట్ సమావేశంలో తెలంగాణాలో కరోనా వ్యాప్తి, తీసుకోవాల్సిన చర్యలు, బాధితులకు అందించే వైద్యం, కొత్త ఆస్పత్రులపై చర్చ, లాక్ డౌన్ మినహాయింపులు వంటి వాటి గురించి చర్చిస్తారు అని సమాచారం. లాక్ డౌన్ ని కేంద్రం మే 17 వరకు విధించింది. ఎల్లుండి తో తెలంగాణాలో లాక్ డౌన్ ని ముగిస్తారు. దేశ వ్యాప్తంగా ఉంటుంది కాబట్టి కేసీఆర్ 7 వ తేదీ అని చెప్పినా…

మే 17 వరకు కొనసాగించాల్సి ఉంటుంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు మద్యం అమ్మకాలకు అనుమతులు ఇచ్చే విషయమై కేబినేట్ లో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. మద్యం అమ్ముకోవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సర్కార్ చెప్పింది. దీనితో దాదాపు అన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. ఏపీలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వగా ఆరెంజ్ జోన్ లో కూడా జనం సామాజిక దూరం పాటించలేదు.

ఈ పరిస్థితిని గమనించిన సిఎం కేసీఆర్ మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చినా సరే మద్యం దుకాణాలకు వచ్చే వారికి ముందు టోకెన్ ఇవ్వాలి అని దుకాణం వద్ద పది మందికి మించి ఉంటే కేసులు నమోదు చెయ్యాలని ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ముందే ఏ ప్రాంతంలో షాపు తెరుస్తున్నారో సమాచారం ఇచ్చి… అక్కడి వాళ్ళే అక్కడికి రావాలి గాని బయటి ప్రాంతాల వరకు రావొద్దు అని చెప్పే అవకాశం ఉందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version