లాస్ ఏంజెల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ లో బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘నాటు నాటు’ సాంగ్ కి గానూ ఆర్ ఆర్ ఆర్ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించింన సంగతి అందరికీ తెలిసిందే. దీనితో దేశం మొత్తం ఆర్ ఆర్ ఆర్ మూవీ మేనియా తో ఊగిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ RRR టీం కు అభినందనలు తెలిపారు. ఆఖరికి దేశ ప్రధాన మంత్రి మోదీ కూడా అభినందనలు తెలిపారంటే హంగామా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక అవార్డ్ అందుకున్న తర్వాత సెలబ్రేషన్ విడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అవార్డ్ అందుకున్న తర్వాత రాజమౌళి మరియు కీరవాణి తమ ఆనందం ను వేరే లెవల్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. అవార్డు పట్టుకుని వచ్చిన కీరవాణికి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. భారీ ఎత్తున సెలబ్రేషన్స్ జరిగాయి. రాజమౌళితో పాటు కీరవాణి నాటు నాటు స్టెప్ వేయడం నెటిజన్స్ ను బాగా ఆకట్టకుంటుంది.